Wednesday, August 13, 2025
EPAPER
spot_img
Homeరాష్ట్రీయంమిస్‌వరల్డ్‌తో మై స్టాంప్‌ థీమ్‌

మిస్‌వరల్డ్‌తో మై స్టాంప్‌ థీమ్‌

- Advertisement -

– పోస్టల్‌శాఖకు అంతర్జాతీయ గుర్తింపు : ఓపెల్‌ సుచతా చుంగ్‌శ్రీకి అందచేసిన సీపీజీ పీవీఎస్‌ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

భారతీయ తపాల శాఖకు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా తెలంగాణ సర్కిల్‌ కార్యాలయం ‘మై స్టాంప్‌’ థీమ్‌తో మిస్‌వరల్డ్‌ ఓపెల్‌ సుచతా చుంగ్‌శ్రీ ఫోటోను ముద్రించింది. ప్రపంచ వారసత్వ సంపద చార్మినార్‌తో మిస్‌వరల్డ్‌ ఫోటోతో ముద్రించిన ప్రత్యేక స్టాంపును హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వీపీఎస్‌ రెడ్డి దీన్ని ఆమెకు అందచేశారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్న మరో 19 మందికి కూడా ఇదే తరహాలో వేర్వేరు కాన్సెప్ట్‌లతో వారి ఫోటోలను ముద్రించి, ప్రత్యేక స్టాంపులుగా అందచేశారు. మై స్టాంప్‌ థీమ్‌ పట్ల వారంతా ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. తపాలాశాఖ ప్రత్యేకంగా రూపొందించిన మై స్టాంప్‌ ధీమ్‌ను ప్రజలు ఎవరైనా వినియోగించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌ జనరల్‌ పోస్టాఫీసులో రూ.300 చెల్లిస్తే, వారు కోరుకున్న చారిత్రక, వారసత్వ, కళా, సాంస్కృతిక చిత్రాలకు తమ ఫోటోలను అనుసంధానం చేసుకొని, జ్ఞాపకంగా ఉంచుకోవచ్చని తెలిపారు. పర్యాటకులు, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad