Tuesday, July 1, 2025
E-PAPER
Homeబీజినెస్మెరిల్‌ నుంచి మైక్లిప్‌

మెరిల్‌ నుంచి మైక్లిప్‌

- Advertisement -

హైదరాబాద్‌ : మెరిల్‌ లైఫ్‌ సైన్సెస్‌ దేశంలోని తొలిసారి ట్రాన్స్‌కాథెటర్‌ ఎడ్జ్‌-టు-ఎడ్జ్‌ రిపేర్‌ (టీఈఈఆర్‌) సిస్టమ్‌ మైక్లిప్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఇది హృద్రోగ చికిత్స పరిష్కారాలకు అత్యుత్తమంగా ఉఉపయోగపడుతుందని పేర్కొంది. ఇది దేశంలో కార్డియోవాస్క్యులర్‌ చికిత్సలో నూతన ఆవిష్కరణలను చాటుతుందని మెరిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భట్‌ తెలిపారు. వ్యవస్థ తీవ్రమైన మిట్రల్‌ రెగర్జిటేషన్‌ (ఎంఆర్‌) ఉన్న రోగులకు కనీస ఇన్వాసివ్‌ చికిత్సను అందిస్తుందని తెలిపింది. ఇది ఒక గంటలోపు పూర్తవుతుందని.. 3-5 రోజుల్లో రోగులు ఇంటికి తిరిగి వెళ్లవచ్చన్నారు. ఈ ప్రక్రియ అధిక రక్తపోటు, మధుమేహం, గుండె వైఫల్యం వంటి సమస్యలతో బాధపడే వారికి శస్త్రచికిత్స రిస్క్‌ను తగ్గిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -