Friday, September 19, 2025
E-PAPER
Homeజిల్లాలుMyra Fatima: రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఊషూ టోర్నీ గోల్డ్ మెడల్ సాధించిన మైరా ఫాతిమా 

Myra Fatima: రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఊషూ టోర్నీ గోల్డ్ మెడల్ సాధించిన మైరా ఫాతిమా 

- Advertisement -

నవతెలంగాణ నిజామాబాద్ సిటీ 

రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సబ్ జూనియర్ , జూనియర్ ఉషూ టోర్నమెంట్ లో జిల్లాకు చెందిన మైరా ఫాతిమా సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా రాష్ట్ర ఉషూ కార్యదర్శి ఓమర్ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీలో జిల్లాకు చెందిన మైరా ఫాతిమా పాల్గొని సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు ఆయన తెలిపారు . మైరా స్థానిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతుందని ఆయన తెలిపారు. ఈ విజయం పట్ల జిల్లా ఊషూ సంఘం బాధ్యులు పలు క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -