హరినాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వ, నిర్మాణంలో డ్రీం టీం ప్రొడక్షన్స్ పై రూపొందిన చిత్రం ‘నా తెలుగోడు’. హరినాథ్ పోలిచర్ల హీరోగా, తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సోఫియా తన్వీర్ ముఖ్య పాత్రధారులుగా నటించారు. డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హరినాథ్ పోలిచర్ల మాట్లాడుతూ, ‘ఈ సినిమా చిత్రీకరణ, సెన్సార్ పూర్తయ్యింది. సమాజానికి ఉపయోగపడే ఒక విషయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేశాం. ఒక సైనికుడు దేశం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. వారి జీవితం పై, ఆడపిల్లలను కాపాడటంపై, డ్రగ్స్ నుండి సమాజాన్ని కాపాడే కొన్ని అంశాలను ఈ సినిమాలో చూపించాం. నందమూరి తారక రామారావు వల్ల తెలుగు వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. ‘నా తెలుగోడు’ అనే టైటిల్ పెట్టడం గర్వంగా ఉంది. సినిమాలో యుద్ధ నేపథ్యంలో కొన్ని సీన్స్ ఉంటాయి. గోవా, మునార్, హైదరాబాద్ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాను చిత్రీకరించాం. సినిమాకు కట్స్ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్ రావడం మాకు సంతోషకరం. ఇందులో నా పాత్ర సైనికుడుగా ఉండబోతుంది’ అని తెలిపారు.
‘నా తెలుగోడు’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



