హీరో నాగశౌర్య నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతల పూడి నిర్మిస్తున్నారు. శుక్రవారం మేకర్స్ ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘నా మావ పిల్లనిత్తానన్నాడే..’ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు.
‘ఈ సాంగ్‌ని హారిస్ జయరాజ్ వైబ్రెంట్, పుట్ టాపింగ్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ మాస్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. కారుణ్య, హరి ప్రియ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో మెస్మరైజ్ చేశారు. ఈ సాంగ్‌లో నాగశౌర్య, విధి కెమిస్ట్రీ కలర్‌ఫుల్‌గా వుంది. నాగశౌర్య డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది’ అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్), డీవోపీ: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శంకర్.
‘నా మావ పిల్లనిత్తానన్నాడే..’
- Advertisement -
- Advertisement -