నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లాడేగావ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో సాగు అవుతున్న శెనగ, కంది పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ బుధవారం నాడు పరిశీలించి రైతులకు తగు సలహాలు సూచించడం జరిగింది. శెనగ పంటలో ప్రధానంగా ఎండు తెగులు గమనించి దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ (COC) లీటరు నీటికి 3గ్రాములు అనగా ఎకరాకు 500 గ్రాములు లేదా టుబ్ కనజోల్ (Tubaconazole )2ఎంఎల్ లీటరు నీటికి లేదా చిపాన్ని మిథైల్ (Thiphanate methyal) రోకో (ROKO) 1గ్రాము లీటరు నీటికి కలిపి మొక్క బాగా తడిచేలా పిచికారి చేయాలని సూచించడం జరిగింది. శెనగ పంటలో మొదటి స్ప్రే ప్రొఫేనపోస్ (Profenophos ) 50ఈసీ 400ఎంఎల్ఎకరాకు దానితోపాటు వేపనూనె (1500పిపిఎమ్) 500ఎంఎల్ ఎకరాకు + 19.19.19@1 కిలో ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.
కంది పంటలో ప్రధానంగా ఆకు ముడత గమనించి దాని నివారణకు Profenophos 50ఈసీ @400ఎంఎల్ ఎకరాకు లేదా ఎమిక్సీన్ బెంజోనేట్ (Emamection Benzoate) (EM1) 100గ్రాములు ఎకరాకు+ వేప నూనె (1500పిపిఎమ్) 500ఎంల్ ఎకరాకు + ఎసిఫేట్ (Acephate) 300 గ్రాములు ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.రైతు సోదరులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి మందులు పిచికారి చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ పైన రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి సందర్శనలో రైతు సోదరులు పేర్శెట్టి శంకర్, పండరి పాల్గొన్నారు.



