Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనిండుకుండలా నాగార్జున సాగర్‌

నిండుకుండలా నాగార్జున సాగర్‌

- Advertisement -

ఎనిమిది గేట్లు ఎత్తి నీటి విడుదల
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌

సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో 8 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 590 అడుగులకు చేరుకోవడంతో నిండుకుండలా కనిపిస్తుంది. సాగర్‌ డ్యాం 26 క్రస్ట్‌గేట్ల పైనుంచి నీరు పొంగిపొర్లుతుండటంతో అధికారులు ఆదివారం తెల్లవారుజామున రెండు గేట్లను ఐదడుగుల మేరకు ఎత్తి దిగునకు నీటి విడుదల చేశారు. మధ్యాహ్నం నుంచి నాలుగు గేట్లను ఐదడుగుల మేరకు ఎత్త్తగా, సాయంత్రం 8 గేట్లను ఐదు అడుగుల మేరకు వ్యక్తి 64,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి వస్తున్న నీటి పరిమాణం కంటే రెట్టింపు పరిమాణంలో జలాశయం నుంచి బయటకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 65,842 క్యూసెక్కుల నీరు వస్తుండగా సాగర్‌ కుడికాలువ ద్వారా 6465 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7518 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా 20,970 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 18 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఎగువనున్న శ్రీశైలానికి జూరాల, సుంకేశుల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి 1,52,458 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం 885 అడుగులకు గాను 880.60 అడుగులుగా ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img