Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 అడుగులకుగాను.. జూరాల, శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో 2,01,743 క్యూసెక్కులు వస్తుండడంతో ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. దీంతో ఇవాళ సాగర్ ఎమ్మెల్యే రఘువీర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితర స్థానిక అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -