- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రం లోని భోగేశ్వర, సంగమేశ్వర, పోతంగల్ లోని బుగ్గ రామేశ్వర, గుడిమెట్లోని మహాదేవుని, బూర్గుల్లోని రాజరాజేశ్వర ఆలయాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పండుగను పురస్కరించుకొని మహిళలు ఆలయాల్లోని పుట్టలకు పాలు పోశారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆవుపాలతో అన్నదమ్ములకు, ఆడపడుచులు కండ్లు కడిగారు. ఈ సందర్బంగా మండల పరిధిలోని ఆలయాల్లో భక్తులు పోటెత్తారు.
- Advertisement -