నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాలలో నాగుల పంచమి పండుగ వేడుకలను ఘనంగా మహిళా సోదరీమణులు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ పుట్టింటికి రావడం ఆనవాయితీగా పూర్వీకుల నుండి వస్తోంది. పంచమి పండుగ వచ్చిందంటే పెళ్లిలు చేసి అత్తగారింటికి పంపిన అమ్మాయిల తల్లిదండ్రులు తిరిగి తమ బిడ్డను పండుగ సందర్భంగా గ్రామాలకు ఆహ్వానించి వారికి పుట్టింటి సారే పెట్టి గౌరవించడం ఇక్కడి ప్రాంతం వాసుల సాంప్రదాయం.
ఈ సందర్భంగా గ్రామాలలో మహిళలు కొత్త బట్టలు ధరించి పాము పుట్టలు దగ్గరికి వెళ్లి పూజలు చేసి పుట్టలో పాలు పోస్తారు. ఇంటి వద్ద కూడా పాము ఆకారంలో గోడలకు చిత్రాలు వేసి వాటి కి వెండితో చేసిన పాముఖండ్లను అతికించడం వాటికి పూజలు చేస్తూ నైవేద్యాలు అందిస్తారు. అనంతరం వారి సహోదరులకు పాలతో ఒకసారి నీళ్లతో ఒకసారి కళ్ళను కడగడం జరుగుతుంది. అనంతరం సహోదరులు వారి అక్క చెల్లేల్లు అన్నదమ్ములకు ఆశీర్వాదం ప్రసాదించి మిఠాయిలు తినిపించుకుంటారు. పండుగ సందర్భంగా గ్రామాలలో సాయంకాలం సమయంలో మహిళలందరూ ఒకచోటకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో ఒకరికి ఒకరు అలై బలై చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.
మండలంలో ఘనంగా నాగుల పంచమి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES