Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు..

పట్టణంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని జంబి హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించినారు. నాగుల పుట్ట వద్ద మహిళ భక్తులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళా భక్తులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది ఘనంగా నాగుల పంచమి జరుపుకుంటామన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ తెలిపారు.

పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల నాగ మందిరం లోని నాగుల పుట్ట వద్ద  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మున్సిపల్ మాజీ  కౌన్సిలర్ మరియు బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి  సంగీత ఖాందేష్  ప్రత్యేక పూజలు చేసి పుట్టలో ఆవు పాలు పోసినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కుటుంభ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -