- Advertisement -
నవతెలంగాణ – శంకరపట్నం
శ్రావణమాసం సందర్భంగా శంకరపట్నం మండల కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం నాగ పంచమి పురస్కరించుకొని మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టల వద్దకు చేరుకుని నాగదేవతను దర్శించుకున్నారు. నాగదేవతకు పాలు పోసి, పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. “అమ్మ మమ్మల్ని చల్లగా కాపాడు” అంటూ భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లె స్వరూప, రేణుక, స్వప్న, శైలజ, లత, వసంత, మాళవిక, భాగ్యలక్ష్మి తదితర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -