Thursday, January 8, 2026
E-PAPER
Homeజిల్లాలుబీఆర్ఎస్ లో చేరిన నల్లమోతు సిద్ధార్థ

బీఆర్ఎస్ లో చేరిన నల్లమోతు సిద్ధార్థ

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
పట్టణంలోని 27 వార్డు కాంగ్రెస్ వార్డు ఇంచార్జ్ రేబెల్లి లోహిత్ తో పాటు 200 మంది కాలనీ ప్రజలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బుధవారం బిఆర్ఎస్  పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి  పార్టీలోకి  రాష్ట్ర నాయకులు  నల్లమోతు సిద్దార్ద ఆహ్వానించారు. పట్టణ ముఖ్య నేతలు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, ఎండి.ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్ గార్ల సమక్షంలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహినపడిపోతుందని, రాబోయే భవ్యిషత్తు అంతా బి ఆర్ ఎస్ దే నని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి అందరూ కృషి చేయాలనీ దానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు చిహ్నం కావాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధులకు ఇచ్చిన హామీలు ఏమైనాయని నిలదీయాలని సూచి౦చారు.. ఏ ఒక్క హామీ అయిన పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా పూటకో మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిధముగా మనకు ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ పడిన బాకిని కరపత్రాల రూపంలో ఇంటింటికి పంచి వారు మన బాకీని వెంటనే అమలు చేసేలా డీమాండ్ చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో పద్మశెట్టి కోటేశ్వర రావు,పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, లింగంపల్లి చీరంజీవి, ఎండి.షోయబ్,పునాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, కంచి సత్యనారాయణ, నల్లగంతుల నాగభూషణం, యర్రమళ్ళ దినేష్,దోనేటి సైదులు, శ్రినాద్, వడ్డేపల్లి శ్రీనివాస్, బాచి,కూరపాటి సాంబశివ రావు, సిరసనగండ్ల ఈశ్వర్ చారి,మీసాల జగదీష్  నాంపల్లి యేసు, నరేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -