Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం48 గంటల్లో మొత్తం 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్‌సైట్‌లో ఉంచాలి: సుప్రీంకోర్టు

48 గంటల్లో మొత్తం 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్‌సైట్‌లో ఉంచాలి: సుప్రీంకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బిహార్ స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ‌పై సుప్రీం కోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. బిహార్ SIR పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల పేరు ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మొత్తం 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్‌సైట్‌లో పేర్కొనాలని చెప్పింది. అసలు ఎందుకు తొలగించవలసి వచ్చిందో 48 గంటల్లో పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

బిహార్‌లో ఓటరు జాబితా నుంచి దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్కొంటూ ఇటీవల ఎన్నికల సంఘం ముసాయిదా విడుదల చేసింది. దాంతో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అన్నీ ఆరోపిస్తున్నాయి. గుజరాత్ వ్యక్తులు బిహార్‌లో ఓటర్లుగా మారుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఇప్పటికే బీజేపీ తిప్పికొడుతోంది. తాజాగా దీనిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad