నవతెలంగాణ – పెద్దవంగర: ప్రముఖ కవి, రచయిత బిర్రు పరమేశ్వర్ నంది పురస్కారం అందుకున్నారు. జాతీయ స్థాయి ఐఎస్ఓ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారు హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభ లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని కవితా గానం చేశారు. ఈ సందర్భంగా సినీ నటి శ్వేత బసరాజ్ ఆయనను శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. పరమేశ్వర్ కవితా గానం ను అభినందిస్తూ నంది పురస్కారం అందజేశారు. పరమేశ్వర్ మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తు, పలు వేదికలపై సామాజిక అంశాలపై తన కవితా గానంతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అనంతరం తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులకు కవి పరమేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.



