- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత అన్నారు. ‘‘మా కుటుంబం బాగుండొద్దు.. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుంది. ఇందులో భాగంగా మొదటి అడుగులో నన్ను బయటకు పంపించారు. అదిక్కడితో ఆగదు. నాన్నా(కేసీఆర్).. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి. రేపటినాడు ఇదే ప్రమాదం రామన్న(కేటీఆర్)కు పొంచి ఉంది. మీకు కూడా పొంచి ఉంది. బీఆర్ఎస్ హస్తగతం చేసుకునే కుట్రలో నన్ను పంపించారు’’ అని అన్నారు.
- Advertisement -