- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
నాసా ముక్తి భారత్ ప్రచారం లో భాగంగా బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలన కై స్థానిక వీకేడీవీఎస్ రాజు కళాశాలలో అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు,నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ పి. నాగరాజు,ఎస్ హెచ్ ఓ,ఎస్ఐ టి.యయాతి రాజు, శిక్షణా ఎస్ఐ కే అఖిల, అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్ నాగరాజు, వీకేడీవీఎస్ రాజు కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -