హర్షం వ్యక్తం చేస్తున్న మండల సమైక్య ప్రతినిధులు, జిల్లా డిఆర్డిఏ పీడీ, సెర్ప్ అధికారులు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాంపల్లి మండల సమైక్యకు నేషనల్ అవార్డు వచ్చినట్లు ఏపీఎం పుప్పాల గంగాధర్ శనివారం తెలిపారు. జాతీయస్థాయిలో దక్షిణా జోన్లో జిల్లాలోని జక్రాన్ పల్లి మండల సమైక్య ప్రథమ అవార్డు రావడంతో జక్రాన్ పల్లి మండల సమైక్య ప్రతినిధులు , జిల్లా డిఆర్డిఏ పిడి సాయ గౌడ్, జిల్లా సెర్ఫు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా మహిళా సమైక్యాల పనితీరును గుర్తించి ఏపీ మాస్ స్వచ్ఛంద సంస్థ అవార్డులు అందిస్తోంది. దీనికి గాని ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఏపీ మాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని రాష్ట్రాల పద్మశ్రీ విభూషణ్ అవార్డులు సాధించిన వారిని ఇతరులను ఆహ్వానించి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో డాక్టర్ మర్రిచినారెడ్డి మానవ వనరుల కార్యాలయంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎస్ఐజి ఫెడరేషన్ , ఎఫ్ పి ఓ ఎస్ ల సమావేశం నిర్వహించి అవార్డులను అందజేశారు. జాతీయస్థాయి ఎసేజి ఫెడరేషన్ యొక్క ప్రథమ అవార్డు నాలుగువేల రూపాయలు జక్రంపల్లి మండల సమైక్య కు రాష్ట్ర ప్రణాళికా సంఘము ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అందజేశారు. అదేవిధంగా ఆర్మూర్ మండల సమైక్య కు ద్వితీయ బహుమతి రూ.20000 అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సాయ గౌడ్, ఏపీడి మధుసూదన్, డిపిఎం నీలిమ, మండల సమైక్య అధ్యక్షురాలు సులోచన, కోశాధికారి రజిత, ఏపిఎములు గంగాధర్, భూమేష్, డి ఎం జి లు జనార్దన్ రావు, భోజన్న, మండల సమైక్య అకౌంటెంట్ లక్ష్మి ఆపరేటర్ రజిత తదితరులు పాల్గొన్నారు.



