Saturday, September 27, 2025
E-PAPER
Homeజిల్లాలుబందెల ఓంకార్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

బందెల ఓంకార్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల పరిధిలోని పెనిమిళ్ళ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న బందెల ఓంకార్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని శుక్రవారం హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఘనమైన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్కాకొమురయ్య, తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటీకాల పురుషోత్తం గారి చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ.. విద్యారంగంలో తన విశిష్ట సేవలు, ఆధునిక బోధనా పద్ధతుల వినియోగం, పాఠశాల అభివృద్ధికి కృషి, విద్యార్థుల్లో సృజనాత్మక విలువల పెంపుదల, గుణాత్మక విద్య సాధనలో చేసిన శ్రద్ధను గుర్తించి ఈ అవార్డు లభించిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -