నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ హాజరై మాట్లాడుతూ… హైదరాబాద్ ను నిజాం చేర నుండి విడిపించి తెలగాణలో విలీనం చేసినందున ఈ రోజును జరుపుకుంటున్నామని తెలిపారు. నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడటం జరిగింది అని తెలిపారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతుంది అని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి, జెండా గుడి చైర్మన్ ప్రమోద్,మార్కెట్ కమిటీ మెంబర్ ఈసా, మాజీ కార్పొరేటర్లు కుద్దుస్, రాజేంద్ర ప్రసాద్, నరేందర్ గౌడ్, శ్రీశైలం, ముశ్షు పటేల్, నరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.