నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి డిసిసిబి ప్రధాన కార్యాలయం లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, లింగయ్య, ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగభూషణం వందే, అధికారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా ‘భారత దేశం లో సహకార ఉద్యమం’ అను అంశము పై స్థానిక ఎస్ఎస్ఆర్ కళాశాల లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ , తృతీయ బహుమతులు బ్యాంకు అధ్యక్షులు, డైరెక్టర్లు , సీఈఓ చేతుల మీదుగా అందజేశారు. అధ్యక్షులు మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది, రైతులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం వారు 6 నెలల పొడిగించినందుకు గౌ ముఖ్య మంత్రి కి సహకార శాఖ మంత్రి కి జిల్లా నాయకులకు ప్రాథమిక వ్యవసాయ సహకార అధ్యక్షులు తరపున బ్యాంకు పాలకవర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
డిసిసిబిలో జాతీయ జెండా ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES