- Advertisement -
నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ వాసి ఫోటో జర్నలిస్ట్ పుట్ల నాగేశ్వరరావుకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం అరుదైన గౌరవమని ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తన స్వగృహంలో, పుట్ల నాగేశ్వరరావును శాలువా, పూలదండ, మెమోంటోలతో సన్మానించారు. జర్నలిస్టు రంగంలో ఆయన చేసిన కృషికి తగిన గుర్తింపు అభించినట్లు అయిందని, ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన నగదు రివార్డ్ కొరకు సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అవార్డుతో నాగేశ్వరరావుకు మరింత భాధ్యత పెరిందని భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పనిచేసి మరెన్నో అవార్డులు పొందాలని కోరారు.
- Advertisement -



