Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeనిజామాబాద్ఇందల్వాయిలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

ఇందల్వాయిలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం (ఆగష్టు 29) సందర్భంగా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో విద్యార్థుల చేత కబడ్డీ, హై జంప్ , లాంగ్ జంప్, షాట్ పుట్ మరియు 100, 400 మీటర్స్ రన్నింగ్ మొదలైన అనేక క్రీడలను ఆడించారు. పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలను చదువులో భాగం చేసుకోవాలని,  ఆటల వల్ల క్రమశిక్షణ మరియు ఆరోగ్యం లభిస్తాయని సూచించారు. ఈ క్రీడోత్సవ కార్యక్రమం లో పిఇటి టీచర్లు దివ్య, రోహిత్ లు,  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad