నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ సురేష్ గొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ గొండా మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు అలవాటు పడద్దని, డ్రగ్స్, గంజాయి వంటి చెడు విత్తనాలకు అలవాట్లు చేసుకోవద్దని వాటి వలన కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్క యువత దేశ సంరక్షణ గుర్తించి మెలుగుకోవాలని సూచించారు. నేటి యువత దేశ పౌరులుగా మారుతారని వారి దేశ సంరక్షణ గురించి ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
బస్వాపూర్ లో ఘనంగా జాతీయ యువజన దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



