Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం  

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం  

- Advertisement -

నవతెలంగాణ – చండూరు 
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సీఐటీయై బిఆర్టియు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన  సమ్మె చండూరు మున్సిపల్ కేంద్రంలో విజయవంతం అయినట్లు బిఆర్టియు చొప్పరి దశరథ యాదవ్ తెలిపారు. సందర్భంగా ఆయన చౌరస్తాలో పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కు లను కాలరాస్తోందన్నారు. 43 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. పోరాడి సాధించు కున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకురావడం సరికాదన్నారు. కనీస వేతన చట్టం అమలు కావడం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు  జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ,నాయకులు ధనుంజయ లింగస్వామి అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఐకెపి వర్కర్స్ మున్సిపల్ సిబ్బంది వివిధ కార్మిక సంఘాలు, ఆటో యూనియన్ అధ్యక్షులు చిట్టగోని యాదయ్య శేఖర్ రెడ్డి పరమేశు వెంకన్న కర్నాటి మల్లేశం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -