రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే
ఆంక్షలు తప్పవంటూ హెచ్చరిక
భారత్, బ్రెజిల్, చైనా సహా ఏ దేశమైనా రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే ఆంక్షలు తప్పవని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్టే హెచ్చరించారు. అమెరికా కాంగ్రెస్ సెనెటర్లతో జరిపిన సమావేశం సందర్భంగా బుధవారం ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా ఎగుమతుల కొనుగోలుదారులపై వంద శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన మరునాడే నాటో సెక్రటరీ జనరల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై జరుపుతున్న యుద్ధాన్ని ఆపేయాలని రష్యాపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అయితే రష్యా అందుకు ససేమిరా అనడంతో ఆ దేశంలో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ భావిస్తు న్నారు. రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే 500 శాతం టారిఫ్ విధిస్తామని భారత్, చైనాలను హెచ్చరించారు. ఇప్పుడు నాటో కూడా అలాంటి వార్నింగే ఇచ్చింది. ‘ఈ మూడు దేశాలకు ఓ మాట చెప్పాలని అనుకుంటున్నాను. రష్యాతో వాణిజ్య సంబంధాలు నిలిపివేయని పక్షంలో మీరు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేయండి. శాంతి చర్చలు జరపాలని చెప్పండి. ఆయన అలా చేయకపోతే బ్రెజిల్, భారత్, చైనా నష్టపోతాయి’ అని రట్టే విలేకరులకు చెప్పారు.
ఆఫ్రికా, కరేబియన్ దేశాలు సహా చిన్న చిన్న దేశాలపై పది శాతానికి పైగా సుంకాలు విధించా లని అనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. కనీసం వంద దేశాలపై పది శాతానికి పైగా సుంకాలు వడ్డిస్తామని ఆయన అన్నారు. ట్రంప్ ఇప్పటికే పలు దేశాలకు, యూరోపి యన్ యూనియన్‌కు సుంకాలపై లేఖలు పంపారు. ఔషధాలపై విధించే పన్నులకు సంబంధించి ఈ నెలాఖరులో ప్రకటన చేస్తానని ఆయన తెలిపారు.
ట్రంప్ బాటలో నాటో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES