- Advertisement -
- – ఎం ఏ ఓ కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామస్వామి
- – రైతులకు అవగాహన కార్యక్రమం
- నవతెలంగాణ -తాడ్వాయి
- సమాజంలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తేనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మండల వ్యవసాయ శాఖ అధికారి కుమార్ యాదవ్, ములుగు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముక్తి రామస్వామి, వెలుగు రేఖ ఎన్జీవో సీఈవో రజిత లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని పంభాపూర్ గ్రామంలో వెలుగు రేఖ ఎన్జీవో సీఈవో ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి స్వార్థం లేకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్న బాగుండాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాడని తెలిపారు. నేల, విత్తనాలు, మిత్ర పురుగులను కాపాడుకుంటే ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు లభిస్తాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా సాగు ఖర్చులు తగ్గి, నేల యొక్క సారాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం చేసి క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించి, ముందు తరాల వారికి మంచి భవిష్యత్తు అందించాలని సూచించారు. రైతుల ఆర్థిక వృద్ధితోపాటు వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయడం ఎంతో లాభదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముక్తి రామస్వామి, వెలుగు రేఖ ఎన్జీవో సీఈవో రజిత, ట్రైనర్ సాంబయ్య, ఏ ఈ ఓ లు దుర్గాప్రసాద్, రాజకుమార్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -