– జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న యాజమాన్యం, సిబ్బంది, విలేకరులు, కార్మికులందరికీ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభం ప్రసార మాధ్యమమని చెప్పారు. పత్రికలన్నీ తమ ప్రతిష్టను కోల్పోతున్న సందర్భంలో నవతెలంగాణ లాంటి కొన్ని పత్రికలు ఇంకా విలువలు పాటిస్తూ పాత్రికేయ రంగానికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. నెహ్రూను ఒకప్పుడు పత్రికలు లేని ప్రజాస్వామ్యం కావాలా?అని ప్రశ్నిస్తే..పత్రికలున్న ప్రజాస్వామ్యమే కావాలన్నారని గుర్తు చేశారు.
పత్రికలు లేకుంటే ప్రజాస్వామ్యమే అక్కరలేదని తెలిపినట్టు పేర్కొన్నారు. అందుకు భిన్నంగా ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితులను చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా దిగజారిపోయిన విలువలు ఉన్నాయనీ, ఈ ప్రస్థానం ఎటువైపో తమలాంటి వాళ్లకు అర్థం కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ తిరోగమనాన్ని ఆపగలిగేందుకు నవతెలంగాణ కృషి చేస్తుండటం అభినందనీయమని అన్నారు.
విలువలకు నిదర్శనం ‘నవతెలంగాణ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES