నవతెలంగాణ – ఆలేరు టౌను
ప్రజా సమస్యల పరిష్కారానికి నవతెలంగాణ దినపత్రిక కృషి చేస్తుందని, కథనాలు రాయడంలో జర్నలిస్టులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని, ఆలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యాలాద్రి అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్సై ,ఎన్ వినయ్ నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్, యేలుగల కుమారస్వామి, పోలీస్ సిబ్బందితో కలిసి నవతెలంగాణ దినపత్రిక ఆఫీస్ క్యాలెండర్ లను, డైరీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతతో ప్రజా సమస్యలను , ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ సమాజ సేవలో భాగస్వాములవుతు, నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ, పత్రిక ప్రజలకు అధికారులకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుంది అన్నారు. పత్రికలో మరింత మంచి కథనాలను రాస్తూ ప్రజలను చైతన్య పరచాలన్నారు. నవతెలంగాణ దినపత్రికలో విభాగాలలో పనిచేస్తున్న బాధ్యులకు, జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ గౌడ్, కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



