-సర్పంచ్ కళ్లెం జహంగీర్ విజయ జహంగీర్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నవతెలంగాణ దినపత్రిక పనిచేస్తుందని మాసాయిపేట సర్పంచ్ కళ్లెం జహంగీర్ విజయ గౌడ్ అన్నారు. శనివారం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, నవతెలంగాణ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన వార్డు మెంబర్స్ తో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యలను వెలికితీయడంలో, వాస్తవాలను నిర్భయంగా రాయడంలో నవతెలంగాణ పత్రిక ముందుంటుందని అన్నారు. కార్మికుల, కర్షకుల, మహిళల, విద్యార్థుల సమస్యలపై చేసే ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం దృష్టికి, అధికారులకు తెలిపే విధంగా కథనాలు ప్రచురిస్తూ, కల్పిత కథనాలకు చోటు లేకుండా వాస్తవాలతో వార్తలు రాయడంలో నవతెలంగాణ రిపోర్టర్లు ముందు ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వాకిటి పాండు, బాలకృష్ణ, పాండవుల సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



