నివాళులర్పించిన నవతెలంగాణ బృందం, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ -కూసుమంచి
నవతెలంగాణ స్టేట్ బ్యూరో రిపోర్టర్ సాలే వెంకన్న(ఎస్వీ) మాతృమూర్తి సాలే నర్సమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామంలో ఉంచిన ఆమె మృతదేహాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నవతెలంగాణ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కొత్తపల్లి శ్రీనవాస్‌రెడ్డి, సిబ్బంది తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎస్వీకి, ఆయన సతీమణి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రమ, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నర్సమ్మ కడు పేదరికంలో ఉన్నా ఎందరో అభ్యుదయవాదులకు, కమ్యూనిస్టు నాయకులకు తన నివాసంలో ఆశ్రయం కల్పించారని గుర్తుచేశారు.
తన ఇద్దరి కుమారులను కమ్యూనిస్టుల వైపు నడిపించిన గొప్ప మాతృమూర్తి అని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీల ఎదుగుదలకు తోడ్పాటును అందించి, ఎందరో కమ్యూనిస్టులకు మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు కోటి శివారెడ్డి, లింగా వీరారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మానరావు, మండల కమిటీ సభ్యులు బిక్కసాని గంగాధర్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, గోపి, సీపీఐ(ఎం) గ్రామశాఖ కార్యదర్శి రెడ్డిమల్ల వెంకటయ్య, నవతెలంగాణ కూసుమంచి రిపోర్టర్ కర్ణబాబు, గ్రామ నాయకులు ఇరుగు రంగ, దుబ్బారి మైసయ్య, ఇరుగు వెంకన్న, శివకోటి ఆచారి, అబ్బులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.



