- Advertisement -
– ఎల్విఆర్ షాపింగ్ మాల్ అధినేత శివకుమార్
నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రజల పక్షాన కథనాలు రాస్తూ నవతెలంగాణ దిన పత్రిక తనవంతు కృషిగా ప్రజల పక్షాన క్రియాశీలక పాత్ర సమాజంలో పోషిస్తుందని ఎల్విఆర్ షాపింగ్ మాల్ అధినేత శివకుమార్ తెలిపారు. నిజాలు నిర్భయంగా రాస్తూ అధికారులకు సహకారం అందిస్తుంది. అధికారులు అందిస్తున్న సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో నవతెలంగాణది ప్రత్యేక స్థానం ఉంది. రానున్న రోజుల్లో ప్రత్యేక కథనాలు, వార్తలు రాస్తూ ప్రజలను చైతన్యం చేయాలని కోరుకుంటున్నాం. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పత్రికా విలేకర్లకు, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
- Advertisement -