నవతెలంగాణ-నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 2026-2027 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఈనెల 13వ తేదీన నిర్వహించడం జరుగుతుందని విద్యాలయ ప్రిన్సిపాల్ రాంబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5124 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకున్నారని వారికోసం ఉమ్మడి జిల్లా మొత్తంగా 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. శనివారం ప్రవేశపరీక్ష ఉదయం 11:30 నుండి 1:30 వరకు ఉంటుందని.. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఉదయం 11 గంటల లోపు చేరుకోవాలని ఆయన సూచించారు. పరీక్షకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్న నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ రాంబాబు, ఎగ్జామ్ ఇంచార్జ్ ప్రభాకర్ 9701907749 సెల్ ఫోన్ నెంబర్ ద్వారా సంపాదించాలని ఆయన కోరారు.
శనివారం నవోదయ ప్రవేశ పరీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


