Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునక్సలిజాన్ని అంతం చేయలేరు: నారాయణ

నక్సలిజాన్ని అంతం చేయలేరు: నారాయణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నక్సలిజం నిర్మూలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. నక్సలైట్లను చంపగలరేమో కానీ, నక్సలిజాన్ని మాత్రం అంతం చేయలేరని ఆయన అన్నారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని అమిత్ షా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాలు మారనంత వరకు ఇలాంటి సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. నక్సలైట్లతో చర్చలు జరపబోమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img