- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన సభల నిర్వహణ తేదీలపై చర్చించినట్లు తెలుస్తోంది. సభలకు రావాలని వారికి ఆహ్వానం పలికినట్లు సమాచారం. మరోవైపు 11 ఏళ్లలో ఎన్డీఏ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎంకు అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది.
- Advertisement -