నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికల్లో ఎన్డేయే కూటమి గెలుపొందేందుకు ఎస్‌ఐఆర్(SIR) ఓ కొత్త ఆయుధమని కాంగ్రెస్ ఎంపి మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘం 60 లక్షల మంది ఓటర్లను తొలగించింది. మొత్తం ఓటర్లలో 10 శాతం ఓటర్లను తొలగించారు. ఇందులో ఎక్కువమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లే. ఎన్నికలకు ముందే ఎస్‌ఐఆర్ అనేది ఓటు చోరీ మాధ్యమంగా మారింది. కేవలం ఎస్‌ఐఆర్ వల్లే ఈ ఎన్నికల్లో జెడియు, బిజెపిలు గెలుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ఎస్‌ఐఆర్ ఒక పెద్ద ఆయుధం. బీహార్‌లో ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారు. కానీ అది ఎన్నికల్లో ఎందుకు కనిపించదు? ఎందుకంటే.. ఎన్నికల కమిషన్ అమ్ముడుపోయింది. అది బిజెపితో కలిసి పనిచేస్తోంది అని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
‘SIR’వల్లే బీహార్‌లో ఎన్డేయే గెలుపు: ఎంపీ మాణిక్యం ఠాగూర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



