నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్టు 3న జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఇప్పటికే పూర్తిచేసింది. వచ్చే ఆదివారం (ఆగస్టు 3న) ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనుంది. అయితే పరీక్షకు 4 రోజుల ముందు అంటే జూలై 31న అడ్మిట్ కార్డులను ఎన్‌బీఈఎంఎస్ విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లో అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు తమన హాల్‌టికెట్‌ను తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD), మాస్టర్ ఆఫ్ సర్జరీ (MS), పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్ డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB) డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DrNB), డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్ పీజీ ప్రవేశ పరీక్ష..నేడు అడ్మిట్ కార్డులు విడుదల
- Advertisement -
- Advertisement -