Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పంటలు నాశనం…

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పంటలు నాశనం…

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదురావుపేట (ఇప్పలపల్లి) గ్రామంలో గత పది రోజుల నుండి త్రీఫేస్ కరెంటు లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వరి పైరు పొట్ట దశలో ఉండగ సాగునీరు లేక పైరు ఎండిపోతుందని కలత చెందుతున్నారు. విద్యుత్ అధికారులకు సమస్య విన్నవించినప్పటికీ స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన జాదురావుపేట మాజీ సర్పంచి ఆత్మకూరి రాజయ్య యాదవ్ విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -