- Advertisement -
- – సీతారాంనగర్ కాలనీలో పెయింటర్ మృతి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో 33కె వి విద్యుత్ వైర్లు తగిలి పెయింటర్ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో సీతారాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అశోక్ తన ఇంటిలో పెయింటింగ్ పని నిమిత్తం గౌతమ్ నగర్కు చెందిన నాందేవ్ ను పనికి తెచ్చుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్లో పని ఉండగా కర్ర కోసమని పై అంతస్థకు వెళ్లి కర్ర తీసుకునేందుకు వెళ్లగా తలకు 33 కెవి వైర్ తగిలి కరెంట్ షాక్ తో మృతి చెందాడు. గౌతమ్ నగర్ కు చెందిన నాందేవ్ (34) కరెంట్ వైర్ చదవడంతో అక్కడికక్కడే కుప్పకూలేడు. సంఘటన స్థలానికి చేరుకున్న వివరాలడిగి తెలుసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని అయిన అశోక్ పై కేసు నమోదు చేశామని ఎస్సై గంగాధర్ తెలిపారు.
పలుమార్లు ఫిర్యాదు చేసినా… - సీతారంనగర్ కాలనీలోని హైటెన్షన్ తీగలను తొలగించాలని పలుమార్లు విన్నవించినా విద్యుతు అధికారులు పెడచెవిన పెట్టారు. కాలనీ వాసులందరరూ కలిసి గతంలో విద్యుత్ ఎస్ఈ ని కలిసి ఈ విషయంపై విన్నవించారు. అయితే తీగలు తొలగించేందుకు అవసరమైన నగదును డీడీ రూపంలో చెల్లిస్తేనే తీగలు తొలగిస్తామని, శాఖ తరపున నిదులు విడుదల కావని అన్నారు. దీనికి కూడా కాలనీవాసులు అంగీకరించారు. సర్వే చేయిస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు సర్వే చేయించలేదు. పైగా గత రాష్ట్రసర్కారు పట్టణ ప్రగతిలో భాగంగా ప్రమాదకరంగా మారిన తీగలు, స్తంభాలు తొలగించాలని ఆదేశించింది. కానీ ఇవేవీ ఆ శాఖాధికారులు పట్టించుకోలేదు.
- పైగా ప్రస్తుతం ప్రమాదం జరిగిన హైటేన్షన్ తీగలు ఉన్న స్తంభం పూర్తిగా తుప్పు పట్టి ఒక వైపునకు వంగింది. ఈ విషయం కూడా లైన్‌మేన్‌తో సహా డీఈల దృష్టికి తీసుకొచ్చిన స్పందనలేదు. ప్రస్తుతం స్తంభం విరిగింపడేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు అది మరింత కుంగింది. ప్రమాదాలు జరగక ముందే అధికారులు మెల్కొని ఈ స్తంభాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. . ఈ తీగలను తొలగించేందుకు ప్రత్యామ్నాయం కూడా ఉంది. కానీ అధికారులు అటువైపు దృష్టిసారించడం లేదు. ప్రధాన రహదారి గుండా ఆర్ ఆర్ చౌరస్తా నుంచి మళ్లించే అవకాశం ఉంది. ఈ దిశగా ఆలోచిస్తే ప్రజల ప్రాణాలు కాపాడిన వారవుతారు.
- గతంలో కూడా ప్రమాదాలు…
- ఈ కాలనీలో ప్రమాదం జరగటడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారని కాలనీవాసులు చెబుతున్నారు. ఏదేమైనాప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -