Tuesday, December 9, 2025
E-PAPER
Homeజాతీయంనెహ్రూ, కాంగ్రెస్సే టార్గెట్‌

నెహ్రూ, కాంగ్రెస్సే టార్గెట్‌

- Advertisement -

వందేమాతరం గేయంపై చర్చలో ప్రధాని మోడీ
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జపం చేశారు. దేశ నిర్మాణంలో నెహ్రూ పోషించిన పాత్రను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోడీ వేదిక ఏదైనా నెహ్రూ, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై లోక్‌సభలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నెహ్రూపై విషం వెళ్లగక్కారు. తన 11 ఏండ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేక, గత పాలకులను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. వందేమాతరం గేయంపై చర్చ కాస్తా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో అదుపుతప్పి రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్‌ ముక్కలు ముక్కలు చేసిందనీ, ముస్లింలను రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతోనే ఆ గేయాన్ని ముక్కలు చేసిందని మోడీ అన్నారు. లోక్‌సభలో ప్రధాని మోడీ ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో అధికార పార్టీ సభ్యులు సిగ్గు సిగ్గు అంటూ అరిచారు. గడిచిన శతాబ్దంలో కొన్ని శక్తులు జాతీయ గేయం పట్ల మోసానికి పాల్పడ్డాయని తెలిపారు. జాతీయ గేయాన్ని ముక్కలు చేసిందెవరన్న విషయాన్ని రాబోయే తరాలకు తెలియజేయాలని.. మొహమ్మద్‌ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్‌ 1937లో వందేమాతరం గేయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిందని, కానీ కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూ ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించలేదని, బదులుగా వందేమాతరం గేయాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. వందేమాతారాన్ని జిన్నా వ్యతిరేకించిన తరువాత నెహ్రూకు సుభాష్‌ చంద్ర బోస్‌ లేఖ రాశారని, అయితే ఆ గేయం ముస్లింలను చిరాకు పరిచే రీతిలో ఉందని నెహ్రూ పేర్కొన్నారన్నారు. ఎమర్జెన్సీ పాలన సమయంలోనూ వందేమాతరం గీతానికి వందేండ్లు నిండాయని, కానీ ఆ సమయంలో రాజ్యాంగం తీవ్ర వేదనకు గురైందని అన్నారు. ”బెంగాలీ రచయిత బంకిమ్‌ చంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం గేయాన్ని రాశారు.ఈ గేయం స్వాతంత్య్ర సమరోత్సాహ సమయంలో యావత్‌ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చింది. వందేమాతారం గేయానికి 50 ఏండ్లు నిండిన సమయంలో దేశం బ్రిటీష్‌ పాలనలో ఉంది. ఇక వందేండ్లు నిండిన సమయంలో దేశంలో ఎమర్జెన్సీ ఉంది” అని ప్రధాని మోడీ న్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే లక్షలాది మంది వందేమా తం ఆలపించడం వల్లేనని, వాళ్లంతా స్వాతంత్య్రం కోసం పోరాడారని తెలిపారు. పవిత్రమైన వందేమాతరం గీతాన్ని గుర్తు చేసుకోవడాన్ని ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ గొప్ప అవకాశంగా భావించాలన్నారు. బ్రిటీష్‌ పాలకులు గాడ్‌ సేవ్‌ ద క్వీన్‌ అన్న గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో వందేమాతరం గీతాన్ని రాసినట్టు మోడీ తెలిపారు. వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం కాదని, బ్రిటీష్‌ పాలకుల ఆధీనం నుంచి భరతమాత స్వేచ్ఛ కోసం జరిగిన పవిత్ర యుద్ధం అని అన్నారు. బ్రిటీష్‌ వారు 1905లో బెంగాల్‌ను విభజించిన ప్పుడు వందేమాతరం ఒక ఆయుధంలా బలంగా నిలబడి ఐక్యతా స్ఫూర్తిని రగిల్చిందని పేర్కొన్నారు. విభజించి పాలించాలనే విధానాన్ని బ్రిటీషర్లు అవలంబించినప్పుడు బెంగాల్‌ మేథో శక్తి దేశానికి మార్గదర్శకం చేసిందని తెలిపారు. దేశాన్ని ఏకతాటిపై నడిపించిన వందేమాతర గీతానికి పునర్వైభవం రావాలని, ఇప్పుడు జరిగే చర్చలు భవిష్యత్‌ తరానికి స్ఫూర్తి కావాలని, 2047 వికసిత్‌ భారత్‌ నెరవేరాలంటే వందేమాతరం స్ఫూర్తి అవసరమని ప్రధాని ఉద్బోధించారు.
ప్రధాని మోడీని తప్పుపట్టిన టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌
వందేమాతర గీతాన్ని బెంగాలీ కవి బంకిమ్‌ చంద్ర ఛటర్జీ రాశారని ప్రధాని మోడీ అన్నారు. ఆ సమయంలో బంకిమ్‌ గురించి ప్రస్తావిస్తూ.. బంకిమ్‌ దా అని మోడీ అనడాన్ని టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌ తప్పుపట్టారు. బంకిమ్‌నుదాతో సంబోధించడాన్ని ఆయన వ్యతిరేకించారు. బెంగాలీలు దా దా అని సోదరులను, స్నేహితులను సంబోధించేందుకు ఆ పదాన్ని వాడుతుంటారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో బంకిమ్‌ దా అనడం అగౌరవప రచడమే అవుతుందని, బంకిమ్‌ బాబు అని పిలవాలని సౌగత్‌రారు అన్నారు. ఈ సూచనకు ప్రధాని మోడీ తక్షణమే స్పందించారు. బంకిమ్‌ బాబు అని పిలుస్తానని, మీ మనోభావాలను గౌరవిస్తానని ప్రధాని మోడీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -