Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెట్టేవాని పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి

పెట్టేవాని పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవూర
మండలం లోని పొట్టే వానితండా ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు, బాలల దినోత్సవం ప్రధానోపాధ్యాయులు ఇరుమాది పాపిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక బృందం, అంగన్వాడీ టీచర్లు సమక్షంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా  పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి  మాట్లాడుతూ.. భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత మొట్టమొదటి ప్రధాన మంత్రి, జవహర్ లాల్ నెహ్రూ అని తెలిపారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇంగ్లాండ్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో న్యాయ శాస్త్రంలో బారిష్టర్ పూర్తిచేసి స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన మహా గొప్ప స్వాతంత్ర వాది అని తెలిపారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలు అంటే అమిత ప్రేమ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవాన్ని బాల్ దివస్ అని కూడా అంటారని, బాలల హక్కులు, సంరక్షణ విద్యపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా నవంబర్14న బాలల దినోత్సవంజరుపుకుంటామని తెలిపారు. సందర్భంగా  పాఠశాలలో ఆట పోటీలు నిర్వహించారు ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఉపాధ్యాయులు గంగమ్మ,వెంకటేశ్వర్లు,ఐసీడీఎస్ సూపర్ వైజర్ గౌసియా బేగం,అంగన్వాడీ టీచర్ నారాయణమ్మగ్రామస్తులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -