Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెహ్రూ ఆలోచనా విధానమే దేశాభివృద్ధికి మూలం

నెహ్రూ ఆలోచనా విధానమే దేశాభివృద్ధికి మూలం

- Advertisement -

డా. మువ్వా రామారావు
ప్రతి విద్యార్థి చేతుల్లో రాజ్యాంగం ఉండాలి: డా. రాజు
నెహ్రూ లౌకిక విధానం ఆదర్శప్రాయం: కస్తూరి ప్రభాకర్
నవతెలంగాణ – మిర్యాలగూడ 

నెహ్రు ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శమని ఈ దేశంలో డ్యాముల నిర్మించడం దగ్గర నుండి ఐఐటి స్థాపించడం వరకు నెహ్రూ విధానాలు ఎంతో మంచి ఫలితాలను సాధించగలిగాయని ఎంతో దూరదర్శతో నెహ్రూ విదేశాంగ విధానాన్ని రూపొందించారని జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ మువ్వ రామారావు అన్నారు. రాజ్యాంగ  ఆమోదించిన దినాన్ని పురస్కరించుకొని బుధవారం  పట్టణంలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన నెహ్రూ ఆలోచన విధానం శాస్త్రీయ దృక్పథం అనే అంశం మీద పాఠశాల విద్యార్థుల నిర్వహించిన వ్యాసరచన పోటీలలో  రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిలో గ్రంథాలయ రీడర్స్ కు నిర్వహించిన రాజ్యాంగ అమలు తీరు , ఎదురవుతున్న సవాళ్లు అనే అంశం మీద పెట్టిన వ్యాసరచన వకృత పోటీల బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మువ్వా రామరావు మాట్లాడుతూ నాటి దేశ చరిత్రను క్షుణ్ణంగా విద్యార్థులు చదవాలని రానురాను చరిత్ర వక్రీకరణకు గురవుతుందని, నెహ్రూ ఆలోచన విధానం గురించి విద్యార్థులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక వేత్త డాక్టర్ రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్క విద్యార్థి క్షుణ్ణంగా చదవాలని రాజ్యాంగాన్ని అవపాసన పట్టినప్పుడే హక్కులు విధులు బాధ్యతలు తెలుసుకుంటామని భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు భారత రాజ్యాంగ పుస్తకాలను అందించారు.

మరో గ్రంథాల ఉద్యమ నాయకులు కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా శాస్త్రీయ ధోరణిలో ఆలోచించి భవిష్యత్ కు బాటలు వేయాలని అన్నారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులు కన్సోలేషన్ విభాగంలో వరుసగా సాయి రక్షిత ఆఫీసా శివాని అఖిల, మొదటి బహుమతి దేహశ్రీ రెండవ బహుమతులు మహేందర్ చంద్రిక మూడో బహుమతి ఆయేషా సిద్ధికి స్పందన జయదీప్, ఉపన్యాస పోటీలలో తేజస్విని అభిలాష్ రెడ్డి శివాని తదితర పాఠశాల చెందిన విద్యార్థులు గెలుచుకున్నారు. గ్రంథాలయ విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి డాక్టర్ రాజు, చేతుల మీదుగా భారత రాజ్యాంగ పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ లైబ్రేరియన్ శ్యామ్ సుందర్ ప్రసాద్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కందుకూరి సుదర్శన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే కొండల్ రెడ్డి, భారత్ బచావో జిల్లా అధ్యక్షులు ఉదయ కిరణ్మయి, సుధాకర్ వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -