Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెహ్రూ సేవలు దేశానికి ఎనలేనివి

నెహ్రూ సేవలు దేశానికి ఎనలేనివి

- Advertisement -

జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 
నవతెలంగాణ – వనపర్తి 

భారత స్వాతంత్ర్య సమరయోధులు, దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న బాలసదనంలో భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ నెహ్రూ చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే ఉన్న చిన్నారులతో కేకు కట్ చేయించి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధులు, దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. నెహ్రూ కి చిన్నారులు అంటే అమితమైన ప్రేమ ఉండేదని గుర్తు చేశారు. బాలసదనంలో ఉండే విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను, చిన్నారులను వారు కోరినట్లుగా హైదరాబాద్ పర్యటనకు తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా బాలసదనంలోని చిన్నారులకు విద్యార్థులకు కలెక్టర్ స్వెటర్లు పంపిణీ చేశారు.

అదేవిధంగా వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు మెమెంటోలు అందజేశారు. క్విజ్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి ప్రత్యేక ప్రశంసలు తెలిపారు. బాలసదనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరించిన జిల్లా కలెక్టర్కు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -