• భారీ వర్షానికి నేలకూలీన ఇంటిగోడ
• నిరాశ్రయులైన పేద కుటుంబం 
• ఇళ్లు మంజూరు చేయాలని వేడుకోలు 
నవతెలంగాణ – పెద్దవంగర
మొంథా తుఫాను దెబ్బకు ఓ పేద కుటుంబం గూడు చెదిరింది.. గుండె పగిలింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇంటి గోడ కుప్పకూలింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గురువారం మండలంలోని గంట్లకుంట గ్రామంలో జరిగింది. గ్రామంలోని దలిత కుటుంబానికి చెందిన చింతల సైదమ్మ -ఎల్లయ్య దంపతులు సుదీర్ఘ కాలంగా ఓ పూరిగుడిసే లో నివసిస్తున్నారు. తమకున్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ, కూతురు రాజేశ్వరి తో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో మధ్యాహ్నం ఇంటిముందు ఉన్న సమయంలో ఒకసారిగా ఇంటిగోడ కుప్పకూలింది. ఇంటి గోడ కూలడంతో ఆ పేద కుటుంబం రోడ్డున పడింది. దీంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. అధికారులు వెంటనే స్పందించి, నిరాశ్రయులైన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
గూడు చెదిరే.. గుండె పగిలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    