Tuesday, September 16, 2025
E-PAPER
Homeఖమ్మంనూతనంగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

నూతనంగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

- Advertisement -

– ప్రారంభించిన ఎస్ఈ మహీందర్
నవతెలంగాణ – అశ్వారావుపేట

భవిష్యత్ వ్యవసాయ విద్యుత్ వినియోగం సరిపడా విద్యుత్ పరికరాలను విస్తరిస్తున్నాం అని ఎస్ఈ జీ.మహేందర్ తెలిపారు. మంగళవారం నారాయణపురం సబ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన నూతన 5 మెగా ఓల్టేజ్ ఏంపియర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.  భవిష్యత్తులో పోడు భూము అధిక విద్యుత్ సామర్ధ్యం దృష్ట్యా నారాయణపురం సబ్ స్టేషన్ లో రెండవ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసామని తెలిపారు.ఈ సౌకర్యం తో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గి ఓల్టేజ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఆపరేషన్స్ డీఈ నందయ్య,మార్కెటింగ్ డీఈ వెంకటేశ్వర్లు,అశ్వారావుపేట ఏడీఈ వెంకటరత్నం,టీఆర్ఈ ఏడీఈ రాంబాబు,వినాయక పురం ఏఈ సంతోష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -