నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు.
మురళీ మనోహర్ దర్శకుడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో బ్రహ్మానందం, తమిళ హాస్య నటుడు యోగిబాబుతో పాటు మూవీ టీమ్ పాల్గొంది. ప్రొడ్యూసర్ జయకాంత్ మాట్లాడుతూ, ‘తెలుగులో వస్తున్న డిఫరెంట్ డార్క్ కామెడీ చిత్రమిది. సినిమా మొత్తం జారు రైడ్‌లా ఉంటుంది. నేను, మురళీ ఈ మూవీని స్టార్ట్ చేశాం. బడ్జెట్ కొంచెం ఎక్కువైంది. అప్పుడు వేణు, అమర్ ముందుకొచ్చి మనం ఎంత బడ్జెట్ అయినా చేద్దాం అని సపోర్ట్ చేశారు. సంధ్య లేకపోతే ఈ మూవీ కంప్లీట్ అయ్యేది కాదు. మా సినిమాకు యోగి బాబు సహా మంచి కాస్ట్ అండ్ క్రూ దొరికారు’ అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకొక స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. దర్శకుడు మురళీ మనోహర్ నన్ను ఈ మూవీలో డిఫరెంట్‌గా చూపించాడు. అలాగే యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది’ అని చెప్పారు.
‘ఈ సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. బ్రహ్మానందం క్యారెక్టర్ ద్వారానే కథ నెరేట్ అవుతుంది. ఆయన ద్వారానే ఈ పాత్రలన్నీ పరిచయం అవుతాయి. ఈ సినిమా కోసం మా నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని డైరెక్టర్ మురళీ మనోహర్ తెలిపారు. యోగిబాబు మాట్లాడుతూ, ‘ఈ సినిమా ద్వారా నేరుగా తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. మా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సహా మా టీమ్ అందరికీ నా విషెస్ చెబుతున్నా. బ్రహ్మానందంతో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. నేను చేసిన ‘సార్ మేడమ్’ సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. మీ అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఆ పాత్ర ఉంటుంది’ అని అన్నారు.
నయా డార్క్ కామెడీ
- Advertisement -
- Advertisement -