నవతెలంగాణ-కంఠేశ్వర్: నిజామాబాద్ స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ స్టాపర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ అధ్యక్షతన ఆదివారం ఆర్ అండ్ బి అతిధి గృహంలో జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. గత రెండు సంవత్సరాలుగా అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్న కర్క రమేష్ ప్రస్తుతం వాడి గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. దీంతో కమిటీని మార్పు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు అసోసియేషన్ అధ్యక్షులుగా గుండాజీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా హైమాద్, కోశాధికారిగా కిషోర్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా సదానంద్, కొక్కు రవికుమార్, గౌరవ అధ్యక్షులుగా కొట్టురు శ్రీనివాస్, సలహాదారులుగా మల్లెపూల నరసయ్య లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీ ఏడాది కాలం పాటు కొనసాగించేలా కమిటీ నిర్ణయం తీసుకుంది. అనంతరం నూతన కమిటీని అసోసియేషన్ సభ్యులు శాలువాలు, పూలదండలతో సన్మానం చేసి అభినందించారు. ఈ సమావేశంలో బ్యాగరి శ్రీనివాస్, తంగేళ్ల ప్రకాష్, రోoడ్ల శ్రీనివాస్ రెడ్డి, మల్లెపూల నవీన్, కొట్టూరు ప్రమోద్ లు పాల్గొన్నారు.



