Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మథురా తండాలో నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభం..

మథురా తండాలో నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మథురా తాండాలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆదేశాల మేరకు జుక్కల్ మండల విద్యా శాఖ అధికారి తిరుపతయ్య సోమవారం తాండ గిరిజన గూడెంలో నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి తిరుపతయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం నెలకొల్పాలని ఉద్దేశంతో కొత్త పాఠశాల ప్రారంభించడం జరిగింది తెలిపారు. ఈ ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తుల సహకారంతో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు 18 మంది పిల్లలను చేర్పించడం జరిగింది అని  అన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అన్ని వసతులు కల్పిస్తామని కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలియజేశారని ఎంఈఓ తెలిపారు. తండా పిల్లలను ఇతర గ్రామాలకు విద్య నేర్చుకోవడానికి వెళ్లకుండా తమ గ్రామంలోని విద్యను అభ్యసించడం జరుగుతుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజయ్ చౌహాన్ , సిఆర్పి బిల్లు సింగ్ ,  ప్రధానోపాధ్యాయులు బాబు సార్, విజయలక్ష్మి, గ్రామస్తులు బాబు నాయక్ , తదితరులు హాజరయ్యారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -