ప్రారంభించిన చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్
బీజింగ్ : భారత్ ఆదివారం షాంఘైలో తన కొత్త అత్యాధునిక కాన్సులేట్ భవనాన్ని ప్రారంభించింది. 32 ఏండ్ల తర్వాత షాంఘైలో భారత కాన్సులేట్ స్థానం మారడం ఇదే మొదటిసారి. ఇది షాంఘైలోని భారత వ్యాపారులు, ముఖ్యంగా తూర్పు చైనాలోని యీవూ వంటి నగరాల్లో ఉన్న భారత వ్యాపార సమూహానికి ఈ కాన్సులేట్ సేవలు అందిస్తుంది. చాంగ్‌నింగ్ జిల్లాలోని ప్రముఖ డానింగ్ సెంటర్‌లో 1436 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త భవనాన్ని చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ప్రారంభించారు. ఈ ఏడాది భారత్-చైనా దౌత్య సంబంధాలకు 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ మార్పు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నదని చెప్పారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ విస్తరణతో భారతీయులు, చైనా భాగస్వాములకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలమని చెప్పారు. ఇటీవలే భారత్-షాంఘై మధ్య డైరెక్ట్ విమానాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ కొత్త కాన్సులేట్ సామర్థ్యం మరింత సమయోచితమైందని మాథుర్ తెలిపారు.
షాంఘైలో భారత కొత్త కాన్సులేట్ భవనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



