Thursday, July 24, 2025
E-PAPER
Homeసినిమాసరికొత్త పొలిటికల్‌ సినిమా

సరికొత్త పొలిటికల్‌ సినిమా

- Advertisement -

‘మార్గన్‌’ తరువాత హీరో విజయ్‌ఆంటోనీ నటించిన చిత్రం ‘భద్రకాళి’. అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజీ రామాంజనేయులు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజరు ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌, మీరా విజయ్‌ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ‘మార్గన్‌’ చిత్రాన్ని విడుదల చేసిన ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను కూడా రిలీజ్‌ చేస్తోంది. ఈ సినిమా గురించి హీరో విజరు ఆంటోని మాట్లాడుతూ,’ నా గత చిత్రం ‘మార్గన్‌’కి అద్భుతమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ కతజ్ఞతలు. ఈ సినిమాలో నటించడం అదష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత చాలామంది దర్శకుడు అరుణ్‌ ప్రభుని గొప్పగా అభిమానిస్తారు. గతంలో వచ్చిన పొలిటికల్‌ సినిమాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుంది’ అని అన్నారు. ‘విజయ్‌ ప్రతిదీ చాలా డీటెయిల్డ్‌గా డిజైన్‌ చేస్తారు. రామ్‌కి మా నాన్నతో కూడా పరిచయం ఉంది. ఆయనకి ఆల్‌ ది బెస్ట్‌. ప్రేక్షకులకి సినిమా రాబోతుందని చెప్పడం చాలా ముఖ్యం. ఈ సినిమాని ఇంత ఉత్సాహంగా ప్రమోట్‌ చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని నిర్మాత సురేష్‌ బాబు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -